పెట్రోలింగ్ చేయాల్సిన కానిస్టేబులే దొంగగా మారాడు!

  • నోయిడా ప్రాంతంలో ఘటన
  • స్టోర్ ముందున్న పాల ప్యాకెట్ల దొంగతనం
  • కానిస్టేబుల్ ను గుర్తించే పనిలో అధికారులు
రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తూ, ప్రజలను కాపాడాల్సిన ఓ కానిస్టేబుల్ దొంగగా మారి, సీసీటీవీ కెమెరాలకు అడ్డంగా చిక్కాడు. ఈ ఘటన న్యూఢిల్లీ శివార్లలోని నోయిడాలో జరిగింది. ఇక్కడి ఓ స్టోర్ వద్ద ఆరుబయట పాల వ్యాన్ వచ్చి, పాల ప్యాకెట్ ట్రేలను ఉంచి వెళ్లగా, అదే దారిలో పోలీసు పెట్రోలింగ్ వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్ లో నుంచి దిగిన ఓ పోలీసు, పాల ప్యాకెట్లను చోరీ చేసి, వ్యాన్ లో ఉన్న మరో కానిస్టేబుల్ కు ఇచ్చాడు. ఈ దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా, పోలీసు దొంగగా మారిన వీడియో వైరల్ అయింది. సదరు కానిస్టేబుల్ ను గుర్తించి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. 
Go Back to Shorts
Police
Milk
Petroling
Theft

More Telugu News